సీఎస్కే కఠోర సాధన.. ధోనీ సూచనలతో రెచ్చిపోతున్న హంగర్గేకర్!

  • సూరత్ లోని లాల్ భాయ్ కాంట్రాక్టర్ స్డేడియంలో ప్రాక్టీస్
  • హంగర్గేకర్ కు ఎంఎస్ ధోనీ సూచనలు
  • నెట్ ప్రాక్టీస్ లో సిక్సర్ల వర్షం
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సూరత్ లో కఠోర సాధన మొదలు పెట్టింది. 2022 ఐపీఎల్ కప్పు సాధన లక్ష్యంగా కష్టపడుతోంది. అండర్ 19 ప్రపంచకప్ స్టార్ క్రికెటర్ రాజ్ వర్ధన్ హంగర్గేకర్ ధోనీ సూచనలతో బ్యాటుతోనూ రెచ్చిపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియోలో హంగర్గేకర్ కు ధోనీ సూచనలు ఇస్తుండడాన్ని చూడొచ్చు. ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్ తోనూ అతడు మాట్లాడుతుండడాన్ని గమనించొచ్చు. ఫాస్ట్ బౌలింగ్ తో పాటు, బ్యాటుతో కూడా హంగర్గేకర్ సాధన చేస్తున్నాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా పక్కనే ప్రాక్టీస్ చేస్తూ సిక్సర్లను బాదుతుంటే.. మరోవైపు నెట్స్ మధ్య ప్రాక్టీస్ లో ఉన్న హంగర్గేకర్ సైతం సిక్స్ లతో అలరించాడు. 

మెగా వేలంలో హంగర్గేకర్ ను రూ.1.5 కోట్లు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసింది. అండర్ 19 ప్రపంచకప్ లో పాల్గొన్న హంగర్గేకర్ నాలుగు వికెట్లు తీయడమే కాకుండా లోయర్ ఆర్డర్ లో బ్యాటుతో పరుగులు సైతం సాధించి పెట్టాడు. 


More Telugu News