నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ గారు తీరని అన్యాయం చేశారు: బుద్ధా వెంకన్న
- గతంలో నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు
- 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు
- ఇప్పుడు ఖాళీగా ఉన్నవి 66,309 పోస్టులే అంటున్నారన్న వెంకన్న
గతంలో ఏపీలో ఉద్యోగాల గురించి వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఆయన ప్రస్తావించారు.
''అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చెయ్యడం లేదని ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఖాళీగా ఉన్నవి 66,309 పోస్టులే అంటూ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారు వైఎస్ జగన్ గారు'' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.