చైనా-భారత్ సైనికాధికారుల మధ్య నేడు కీలక చర్చలు
- గాల్వాన్ ఘర్షణ తర్వాత కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఇప్పటి వరకు 14 విడతలుగా చర్చలు
- అయినా కనిపించని ఫలితం
భారత్-చైనా సైనిక అధికారుల మధ్య నేడు మరో విడత కీలక చర్చలు జరగనున్నాయి. 2020 లో గల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తడం తెలిసిందే. వాస్తవాధీన రేఖకు సమీపంగా సైనికుల మోహరింపు ఉండకూడదన్న నియమాన్ని చైనా పాటించడం లేదు. నాటి నుంచి ఇప్పటి వరకు 14 విడతలుగా చర్చలు జరిగాయి. కానీ, ఫలితం లభించలేదు. నేడు 15వ విడత అధికారులు చర్చించనున్నారు.
2020 మే తర్వాత నుంచి 1597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు దేశాల సైనికుల మోహరింపు పెరిగింది. చైనా ఏకపక్షంగా గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద భౌతిక మార్పులకు ప్రయత్నిస్తుండడం వివాదాస్పద అంశంగా నలుగుతోంది. చర్చల్లో ఫలితం వస్తుందన్న దానిపై ఇరు దేశాల్లోనూ పెద్దగా ఆశల్లేవు. కానీ, ఇరు వర్గాలు చర్చల కోసం మార్గాలను తెరిచే ఉంచాలన్న అంగీకారానికి వచ్చాయి. 2020 మే నుంచి ఇరు దేశాలు సుమారు 50 వేలకు పైగా సైనికులు, వాహనాలు, ఆయుధాలు, రాకెట్లను మోహరించాయి.