ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ మాట ఇదే!

  • అంచ‌నాల‌కు విరుద్ధంగా ఫ‌లితాలు
  • ప్ర‌జా ఆశీర్వాదం పొంద‌డంలో విఫ‌లం
  • మీడియా ముందు సూర్జేవాలా
గురువారం విడుద‌లైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ కాస్తంత లేటుగానే స్పందించింది. ఆ పార్టీ కీల‌క నేత‌, మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించినా.. పార్టీ మాట మాత్రం గురువారం రాత్రి 9.30 గంట‌ల‌కు గానీ బ‌య‌ట‌కు రాలేదు. పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సింగ్ సూర్జేవాలా ఎన్నిక‌ల‌పై స్పందించారు. 

ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఘోర ప‌రాభ‌వాన్ని చ‌విచూసింద‌ని సూర్జేవాలా చెప్పారు. ఇందుకు చాలానే కార‌ణాలున్నాయ‌ని చెప్పిన ఆయ‌న అంచ‌నాల‌కు విరుద్ధంగా ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. ప్ర‌జా ఆశీర్వాదం పొంద‌డంలో తాము విఫ‌ల‌మయ్యామ‌ని కూడా ఆయ‌న ఒప్పుకున్నారు. ఈ ఫ‌లితాల‌పై చ‌ర్చించేందుకు త్వ‌ర‌లోనే సీడ‌బ్ల్యూసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.


More Telugu News