కాంగ్రెస్ కు వారి అవసరం రాలేదు.. ఐదుగురి మద్దతుతో 25కు పెరిగిన బీజేపీ బలం!
- సభ్యులు చేజారకుండా కాంగ్రెస్ వ్యూహం
- గోవాకు డీకే శివకుమార్, మధు యాష్కీ గౌడ్
- బీజేపీ వల నుంచి అభ్యర్థులను కాపాడటమే వీరి పని
- 12 సీట్లతో చతికిలబడిన కాంగ్రెస్
- రంగంలోకి దిగకుండానే వెనుదిరిగిన డీకే, యాష్కీ
నిజమే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు ఈ దఫా డీకే శివకుమార్, మధు యాష్కీ గౌడ్‌ల అవసరం పడలేదు. ముందు జాగ్రత్తగా వారిద్దరినీ గోవాకు తరలించిన పార్టీ అధిష్ఠానం..అక్కడి పరిస్థితులతో వారి సేవలను వినియోగించలేదు. వెరసి పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హుటాహుటీన గోవా చేరుకున్న డీకే, యాష్కీలు అక్కడ ఏమీ చేయకుండానే తిరుగు ప్రయాణమయ్యారు.
గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో బీజేపీ కూడా దాదాపుగా మెజారిటీ స్థానాల దగ్గరికి చేరుకోవచ్చని కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా తమ పార్టీ సభ్యులను లాగేసుకుంటుందని కాంగ్రెస్ భావించింది.
గతానుభవాలను తలచుకుని ఆందోళన చెందింది కూడా. వెంటనే రిసార్టు రాజకీయాలకు తెర తీసింది. తనకు ఎదురైన చేదు అనుభవం పునరావృతం కాకూడదని, అలాంటి పరిస్థితే వస్తే.. దానిని అడ్డుకోవాలని డీకే, యాష్కీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిద్దరూ హుటాహుటీన గోవా చేరుకున్నారు.
అయితే గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాసేపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగినా.. ఆ తర్వాత బీజేపీ ఆ స్థానంలోకి వచ్చేసింది. ఫలితాల వెల్లడి పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌కు కేవలం 12 సీట్లు మాత్రమే వచ్చాయి. 20 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గెలిచిన ముగ్గురు స్వతంత్రులతో పాటుగా ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్ 21ని దాటేసి ఏకంగా 25కు చేరుకుంది.