ఉత్త‌రాఖండ్‌లో ముగిసిన కౌంటింగ్‌.. ఎవ‌రికెన్ని సీట్లంటే..!

  • 70 సీట్ల‌లో 47 సీట్ల‌ను గెలుచుకున్న బీజేపీ
  • 19 సీట్ల‌కు ప‌రిమిత‌మైన కాంగ్రెస్‌
  • పార్టీ గెలిచినా.. సీఎం పుష్క‌ర్‌కు ఓట‌మి
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాగంగా ఇప్ప‌టికే పంజాబ్‌, గోవా ఫ‌లితాలు వెల్ల‌డైపోయిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ను ఆప్ త‌న ఖాతాలో వేసుకోగా..గోవాను బీజేపీ వ‌రుస‌గా మూడోసారి ద‌క్కించుకుంది. తాజాగా కాసేప‌టి క్రితం ఉత్త‌రాఖండ్ ఫ‌లితాలు కూడా పూర్తిగా విడుద‌ల‌య్యాయి. నేటి ఉద‌యం మొద‌లైన కౌంటింగ్ రాత్రి 9 గంట‌ల దాకా కొన‌సాగింది.

మొత్తం 70 సీట్లు క‌లిగిన ఉత్త‌రాఖండ్ అసెంబ్లీలో అధికార బీజేపీ ఏకంగా 47 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. అదే స‌మ‌యంలో ఓ రేంజిలో స‌త్తా చాటుదామ‌ని భావించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 19 సీట్ల‌తోనే స‌రిపెట్టుకోక త‌ప్ప‌లేదు. పంజాబ్‌లో స‌త్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్త‌రాఖండ్‌లో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఉత్త‌రాఖండ్‌లో ఆప్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక‌పోయింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఈ రాష్ట్రంలో 4 సీట్ల‌ను గెలుచుకున్నారు. 

ఇక 70 సీట్లు క‌లిగిన ఉత్త‌రాఖండ్‌లో మ్యాజిక్ ఫిగ‌ర్ 36. అయితే దానిని మించి 47 స్థానాలు సాధించిన బీజేపీ అక్క‌డ మ‌రోమారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అయితే సీఎంగా ఉన్న పుష్క‌ర్ సింగ్ ధామి అనూహ్యంగా ఓట‌మిపాల‌య్యారు.  


More Telugu News