ఇది ప్ర‌జాస్వామ్య విజ‌యం... ఎన్నిక‌ల ఫ‌లితాలపై మోదీ

  • మ‌హిళ‌లు, యువ‌త బీజేపీ వెంటే
  • తొలిసారి ఓట‌ర్ల ఛాయిస్ కూడా బీజేపీనే
  • బీజేపీ పాల‌నా తీరుకు ద‌క్కిన ఫ‌లితం
  • పేదరికాన్ని నిర్మూలించేదాకా వ‌ద‌ల‌నన్న మోదీ 
5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫలితాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల‌తో క‌లిసి కాసేప‌టి క్రితం ఢిల్లీలోని బీజేపీ కార్యాల‌యానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితం ప్ర‌జాస్వామ్య విజ‌య‌మ‌ని మోదీ వ్యాఖ్యానించారు. మ‌హిళ‌లు, యువ‌త బీజేపీకి అండ‌గా నిలిచార‌ని కూడా మోదీ అన్నారు.

"ఇది ప్ర‌జాస్వామ్య విజ‌యం. మ‌హిళ‌లు, యువ‌త బీజేపీకి అండ‌గా నిలిచారు. తొలిసారి ఓటేసిన యువ‌కులు బీజేపీకి ప‌ట్టం క‌ట్టారు. గోవాలో అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. గోవా ప్ర‌జ‌లు మూడోసారి బీజేపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ఉత్త‌రాఖండ్‌లో ఫ‌స్ట్ టైమ్ బీజేపీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. 

ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ పాల‌నా తీరును మెచ్చి ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు. పేద‌రికం నిర్మూల‌న అంటూ చాలా నినాదాలు, స్కీంలు వ‌చ్చాయి. కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. పేద‌రికాన్ని తొల‌గించేందుకు బీజేపీ చిత్త‌శుద్దితో ప‌నిచేసింది. పేద‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందేవ‌ర‌కు నేను వ‌దిలిపెట్ట‌ను" అని మోదీ ఉద్వేగ‌పూరిత ప్ర‌సంగం చేశారు.


More Telugu News