షేన్ వార్న్ భౌతికకాయం థాయ్ లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు తరలింపు

  • థాయ్ లాండ్ లో షేన్ వార్న్ ఆకస్మిక మరణం
  • సహజమరణమేనన్న థాయ్ పోలీసులు
  • ఈ నెల 30న వార్న్ అంత్యక్రియలు
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ (52) మార్చి 4న థాయ్ లాండ్ లోని ఓ రిసార్టులో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం, ఇతర లాంఛనాలు పూర్తయ్యాయి. పోస్టుమార్టం రిపోర్టు వెల్లడైన అనంతరం, వార్న్ ది సహజమరణమేనని, తమకు ఎలాంటి అనుమానాలు లేవని థాయ్ లాండ్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, మరణించిన 6 రోజుల తర్వాత నేడు వార్న్ మృతదేహాన్ని థాయ్ లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు తరలించారు. 

శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి, ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో బ్యాంకాక్ నుంచి మెల్బోర్న్ తీసుకువచ్చారు. కాగా, ప్రభుత్వ లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు ఈ నెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్నాయి. వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యే వారి కోసం టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఈ మేరకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News