పంజాబ్ తరహాలోనే ఏపీలోనూ బీజేపీ విజయాన్ని చూడబోతున్నాం: సుజనా చౌదరి

  • పంజాబ్ లో కాంగ్రెస్ దారుణ వైఫల్యం
  • ఆప్ కు 92.. కాంగ్రెస్ కు 18 స్థానాలు
  • అకాలీదళ్ కు 4 స్థానాలు
  • పంజాబ్ ప్రజలు మూడో పార్టీ వైపు మొగ్గారన్న సుజనా
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలు కైవసం చేసుకుని ఘనవిజయం సాధించగా, అధికార కాంగ్రెస్ 18 స్థానాలతో సరిపెట్టుకుని దారుణంగా భంగపడింది. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. అధికార పీఠం ఎక్కాక, నేతలు ప్రజాసేవ కంటే వ్యక్తిగత అజెండాతో కాలక్షేపం చేసినందుకు పంజాబ్ లో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుందని విశ్లేషించారు. 

పంజాబ్ లో అధికార, విపక్షాలను కాదని ప్రజలు మూడో పార్టీ వైపు మొగ్గారని వివరించారు. పంజాబ్ తరహాలోనే ఏపీలో బీజేపీ విజయాన్ని మనం చూడబోతున్నాం అని సుజనా జోస్యం చెప్పారు.


More Telugu News