చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ప‌థ‌కం వెన్నుపోటే: జ‌గ‌న్‌

  • గ‌వ‌ర్న‌ర్ ప‌ట్ల టీడీపీ అనుచిత ప్రవర్తన  
  • విప‌క్షంలో ఉండ‌గా మేం అలా చేయ‌లేదు
  • చంద్ర‌బాబు స‌భ‌కు ఎందుకు రావ‌ట్లేదో ఆయ‌న‌కే తెలియ‌దు
  • ఏపీ అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా గురువారం నాటి స‌మావేశాల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విప‌క్ష టీడీపీ స‌భ్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గవ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అవ‌మానించిన టీడీపీ స‌భ్యులు అనుచితంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక టీడీపీ అధినేత‌, విప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదని సెటైర్లు వేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్‌ వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిదీ. గవర్నర్‌ పట్ల ఇటువంటి ప్రవర్తనను గతంలో ఎప్పుడూ  చూడలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా చేయలేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథక‌మైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చంద్రబాబు ఏ రోజూ విలువ ఇవ్వలేదు’’ అంటూ జగన్ మండిపడ్డారు.


More Telugu News