ప్రజల తీర్పును సవినయంగా అంగీకరిస్తున్నాం: రాహుల్ గాంధీ

  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • అన్ని చోట్లా కాంగ్రెస్ కు నిరాశ
  • పాఠాలు నేర్చుకుంటామన్న రాహుల్
  • కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, కాంగ్రెస్ కు దారుణ ఫలితాలు రావడం పట్ల ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును సవినయంగా అంగీకరిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం అంకితభావంతో కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్ లో 3, పంజాబ్ లో 18, ఉత్తరాఖండ్ లో 18, గోవాలో 12, మణిపూర్ లో 11 స్థానాల్లోనే కాంగ్రెస్ జోరు కనబర్చింది. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికల ఫలితాలతో పాఠాలు నేర్చుకుంటామని, ప్రజా సంబంధ అంశాలపై పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.


More Telugu News