పంజాబ్‌లో 'ఆప్' విక్టరీ.. టోరంటోలో భాంగ్రా డ్యాన్స్!
- పంజాబ్‌లో విక్టరీతో ఆప్ శ్రేణుల్లో జోష్
- ఢిల్లీ, పంజాబ్‌ల్లో మిన్నంటిన సంబరాలు
- విదేశాల్లో కూడా ఆప్ వలంటీర్ల ఉత్సాహం
దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి దక్కిన విజయం కంటే కూడా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చేజిక్కిన గెలుపుపైనే పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ ప్రాంతీయ పార్టీగా ప్రస్థానం మొదలెట్టి ఇంకో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న పార్టీగా ఆప్‌పై రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతేకాకుండా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కిన మెజారిటీ చూసి కూడా విశ్లేషకులు నోరెళ్లబెడుతున్నారు. సీఎం, మాజీ సీఎం, పీసీసీ చీఫ్ లు ఓడిన ఈ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థి మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధించడంపైనా చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఆప్ శ్రేణుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పంజాబ్‌లోని పార్టీ కార్యాలయంతో పాటు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. పార్టీ గుర్తు చీపురు పట్టి రోడ్డెక్కిన ఆప్ వలంటీర్లు స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఆప్‌కు చెందిన వలంటీర్లు విదేశాల్లోనూ సంబరాలు మొదలెట్టారు. కెనడాలోని టోరంటోలో ఆప్ వలంటీర్లు భాంగ్రా నృత్యాలతో తమ పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.