ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ ఓటమి... మరోసారి బీజేపీదే ప్రభుత్వ పీఠం!
- ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 సీట్లు
- 45కి పైగా స్థానాల్లో బీజేపీ హవా
- 20 స్థానాల్లో కాంగ్రెస్ గాలి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ ఓటమి పాలయ్యారు. లాల్ కువా నియోజకవర్గం నుంచి బరిలో దిగిన హరీశ్ రావత్ కు పరాజయం తప్పలేదు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన రావత్ అంతటివాడికి సైతం గెలుపు ముఖం చాటేసింది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా, బీజేపీ 18 స్థానాల్లో నెగ్గి, 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైనట్టే.
ఉత్తరాఖండ్ లో గత 21 ఏళ్లుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఓసారి బీజేపీ గెలిస్తే, మరోసారి కాంగ్రెస్ గెలిచేది. ఈసారి ఆ ఆనవాయతీని బీజేపీ తిరగరాస్తోంది. అయితే, ఆశ్చర్యకరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ కంటే 1,068 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.