ఘోర పరాభవం.. రెండు చోట్లా ఓడిపోయిన పంజాబ్ సీఎం చన్నీ
- భదౌర్, చామ్ కౌర్ సాహిబ్ నియోజకవర్గాల నుంచి పోటీ
- రెండు చోట్లా ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి
- 90 స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఆప్
పంజాబ్ లో ఎంతో పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ చుక్కలు చూపిస్తోంది. ఆప్ దెబ్బకు కాంగ్రెస్ నేతలే కాకుండా అకాలీలు సైతం ఓటమిని మూటకట్టుకుంటున్నారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి ఊహించని ఘోర పరాభవం ఎదురైంది. తాను పోటీ చేసిన చామ్ కౌర్ సాహిబ్, భదౌర్ రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. రెండు చోట్లా ఆయనను ఆప్ అభ్యర్థులే ఓడించారు.
భదౌర్ నియోజకవర్గంలో చన్నీకి దాదాపు 23 వేల ఓట్లు రాగా, ఆప్ అభ్యర్థికి దాదాపు 57 వేల ఓట్లు వచ్చాయి. చామ్ కౌర్ సాహిబ్ నియోజకవర్గంలో చన్నీకి దాదాపు 50 వేల ఓట్లు రాగా, ఆప్ అభ్యర్థికి దాదాపు 54 వేల ఓట్లు వచ్చాయి. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు గాను ఆప్ 90 స్థానాలలో లీడింగ్ లో ఉంది.