నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఒకే ఒక్క ఆటగాడు రోహిత్ శర్మ: గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- డివిలియర్స్, క్రిస్ గేల్ కు కూడా సాధ్యపడలేదు
- కెప్టెన్ గా రోహిత్ విజయవంతమయ్యాడు
- అతడిని ఎదుర్కోవాలంటేనే ఒత్తిడి వచ్చేదని కామెంట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ అని అన్నాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని కొనియాడాడు. ఐపీఎల్ లో అతడిని ఎదుర్కోవాలంటేనే తనకు ఎక్కడలేని ఒత్తిడి వచ్చేదని, చెమటలు పట్టేవని అన్నాడు.
‘‘ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి వాళ్లు కూడా నాకు నిద్రలేని రాత్రులను మిగల్చలేదు. కానీ, కెప్టెన్ గా, ఆటగాడిగా నాకు ఆ పరిస్థితిని తెచ్చిన ఒకే ఒక్క ఆటగాడు రోహిత్ శర్మ’’ అని స్టార్ స్పోర్ట్స్ తో చెప్పుకొచ్చాడు. కాగా, ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అతను టాప్ లో ఉంటాడని చెప్పాడు.
కాగా, ఐపీఎల్ 2013 సీజన్ సందర్భంగా రికీ పాంటింగ్ స్థానంలో మధ్యలో ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి జట్టును అతడు విజయవంతంగా నడిపించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదు టైటిళ్లను అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ ట్రోఫీలను సాధించి పెట్టాడు.