నారా లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

  • పార్టీ మారిన దుగ్గిరాల ప‌రిధిలోని ప‌లు గ్రామాల కార్య‌క‌ర్త‌లు
  • లోకేశ్ స‌మక్షంలో టీడీపీలోకి చేరిక‌లు
  • వైసీపీ ద‌ళిత వ్య‌తిరేక నిర్ణ‌యాలే కార‌ణ‌మన్న లోకేశ్  
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌‌క‌వర్గంలో అధికార వైసీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల మండ‌లానికి చెందిన మంచిక‌ల‌పూడి, పెనుమాలి, పేరుక‌ల‌పూడి గ్రామాల‌కు చెందిన ప‌లువురు వైసీపీ కార్య‌క‌ర్త‌లు తన స‌మ‌క్షంలో పార్టీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు.  

ద‌ళితుల‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ వారంతా పార్టీని వీడినట్టు లోకేశ్ తెలిపారు. వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ చేరికల అంశాన్ని ఫొటోల‌తో స‌హా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


More Telugu News