మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించి, సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత
- పార్టీ తనకు సహకరించలేదన్న మన్ సెరటే
- కొందరు కార్యకర్తల మద్దతుతో విజయం లభించింది
- బీజేపీ క్యాడర్ తనను ఆమోదించలేదని వ్యాఖ్య
- ఉత్పల్ పారికర్ ను బీజేపీ అనధికారిక అభ్యర్థిగా అభివర్ణన
బీజేపీ నేత అతనసియో బాబుష్ మన్ సెరటే పనాజీ స్థానం నుంచి విజయం సాధించారు. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు అయిన ఉత్పల్ పారికర్ ప్రత్యర్థిగా నిలబడినా.. గెలిచి తన సత్తా చూపించారు. పనిలో పనిగా ఆయన బీజేపీపైనా ఆరోపణలు చేశారు.
ఉత్పల్ పారికర్ కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. కోపంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ ప్రభావం చూపలేకపోయారు. ఆయనను, కాంగ్రెస్ అభ్యర్థి ఎల్విస్ గోమెస్ ము ఓడించి మన్ సెరటే విజయం సాధించారు. తన విజయానికి బీజేపీ సహకరించలేదని ఆరోపించారు.
‘‘బీజేపీ అనధికారిక అభ్యర్థి (ఉత్పల్ పారికర్)పైనా, కాంగ్రెస్ పైనా నేను పోరాటం చేశాను. కొంత మంది కార్యకర్తలు, మద్దతుదారుల సహకారంతోనే విజయం సాధ్యమైంది. బీజేపీ క్యాడర్ నన్ను ఆమోదించలేదు’’ అని మన్ సెరటే చెప్పారు.
నిజానికి మన్ సెరటే కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. తర్వాత బీజేపీలోకి వచ్చారు. బీజేపీ గోవా మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి పారికర్ ను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా ఆయనకు పేరుంది.