ఇండియాలో అంతకంతకు తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

ఇండియాలో అంతకంతకు తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
  • గత 24 గంటల్లో 4,184 కరోనా కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 104 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 44,488
ఇండియాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య 5 వేల కంటే తక్కువగా నమోదవుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,184 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం 44,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,20,120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,15,459 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1,79,53,95,649 డోసుల వ్యాక్సిన్ వేశారు.


More Telugu News