గోరఖ్‌పూర్‌లో యోగి.. అమృత్‌సర్ తూర్పులో నవజోత్ సింగ్ సిద్ధూ ఆధిక్యం

  • తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన యోగి
  • వెనుకంజలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్
  • గోవాలో కాంగ్రెస్ అభ్యర్థి కంటే 400 ఓట్ల వెనకంజలో ఉన్న బీజేపీ సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరందుకుంటోంది. ఇప్పటి వరకు వెల్లడైన ట్రెండ్స్ బట్టి పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో పోటీ ఇచ్చినట్టు కనిపించిన కాంగ్రెస్ క్రమంగా వెనకబడిపోతోంది. ఇక, పంజాబ్‌లో ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన కాంగ్రెస్.. ఆప్ దెబ్బకు వెనకబడిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉన్నారు. అలాగే, కర్హాల్ నుంచి బరిలోకి దిగిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేసిన శివపాల్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

పంజాబ్‌లోని అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆధిక్యంలో ఉన్నారు. కొత్త కుంపటి పెట్టుకున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ పటియాలాలో వెనకబడ్డారు. గోవా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమోద్ సావంత్ సాంక్వెలిమ్‌లో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కంటే 400 ఓట్ల వెనకంజలో ఉన్నారు.


More Telugu News