మహిళల ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్
- ఓపెనర్ షెఫాలీ వర్మ స్థానంలో యస్తిక భాటియా
- వన్డే సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న మిథాలీ సేన
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా మారికాసేపట్లో భారత్-ఆతిథ్య న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మిథాలీ సేన టాస్ గెలిచి కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి జయకేతనం ఎగురవేసిన భారత్.. న్యూజిలాండ్‌పైనా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.
భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ షెఫాలీ వర్మ స్థానంలో యస్తిక భాటియా జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది. కాగా, ప్రపంచకప్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 1-4 తేడాతో ఓటమి పాలైంది. నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మిథాలీ సేన గట్టి పట్టుదలగా ఉంది.