అనుమ‌తి వ‌చ్చేసింది!.. ఇప్ప‌టంలోనే జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌!

  • మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కే ప‌ర్మిష‌న్‌
  • వేదిక‌కు దామోదరం సంజీవ‌య్య పేరు
  • కీలకమైన కార్యాచరణ ప్రకటించే అవకాశం 
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌లు ఆ పార్టీ ఎంచుకున్న ప్ర‌దేశంలోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు ఆవిర్భావ వేడుక‌ల‌కు ఏపీ పోలీసుల నుంచి బుధవారం అనుమ‌తి కూడా వ‌చ్చేసింది. తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన భావించింది. అందుకోసం గ్రామానికి చెందిన ప‌లువురు రైతులతో మాట్లాడి వారి భూముల్లోనే వేడుక‌లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఏమైందో తెలియ‌దు గానీ.. ఆవిర్భావ వేడుక‌ల‌కు భూములు ఇస్తామ‌న్న రైతులు ఆ త‌ర్వాత ఇవ్వ‌లేమ‌ని తేల్చేశారు. ఈ ప‌రిణామంతో జ‌న‌సేన‌లో టెన్ష‌న్ మొద‌లైపోయింది.

అయితే ఎట్ట‌కేల‌కు ఇప్ప‌టం ప‌రిధిలోనే పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించుకునేలా జ‌న‌సేన‌కు ఏపీ పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతి నిస్తూ పోలీసులు ఉత్త‌ర్వులు జారీచేశారు. ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.


More Telugu News