రేపు కేఆర్ఎంబీ భేటీ.. నీటి వాటాలు తేలేనా?
- కేఆర్ఎంబీ ముగ్గురు సభ్యుల భేటీ
- వర్చువల్ విధానం ద్వారా సమావేశం
- తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారమే లక్ష్యం
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ వివాదాల పరిష్కారం నిమిత్తం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన గోదావరి, కృష్ణా నీటి ప్రాజెక్టులు ఏకంగా కేంద్రం పరిధిలోకి కూడా వెళ్లిపోయాయి. అయినా కూడా ఫలితం దక్కలేదన్న వాదనలే వినిపిస్తున్నాయి.
తాజాగా కృష్ణా జలాల వివాద పరిష్కారమే లక్ష్యంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం నాడు ప్రత్యేకంగా భేటీ కానుంది. కమిటీలోని ముగ్గురు సభ్యులు వర్చువల్ విధానం ద్వారా సమావేశమై కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ భేటీ ద్వారా అయినా ఈ వివాదాలు పరిష్కారమవుతాయా? అన్నది చూడాలి.