తెలంగాణ‌లో కొత్త‌గా 92 క‌రోనా కేసులు...మ‌ర‌ణాల్లేవ్‌

తెలంగాణ‌లో కొత్త‌గా 92 క‌రోనా కేసులు...మ‌ర‌ణాల్లేవ్‌
  • గత 24 గంటల్లో 24,812 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 36 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 151 మంది
  • ఇంకా 1,316 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,812 కరోనా పరీక్షలు నిర్వహించగా, 92 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 36 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,616 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,316 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.


More Telugu News