వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం ఖాయం: వాణీ విశ్వనాథ్
- నగరిలో మా అమ్మమ్మ నర్సుగా పని చేశారు
- ఇక్కడ నాకు వేలాది మంది అభిమానులు ఉన్నారు
- ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను
పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు మరో సినీ నటి నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరిలో తాను పోటీ చేయడం ఖాయమని వాణీ విశ్వనాథ్ తెలిపారు. ఈరోజు ఆమె నగరిలో పర్యటించారు. నగరికి వచ్చిన వాణీ విశ్వనాథ్ కు స్థానిక మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో తనకు వేలాది మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పని చేశారని వాణీ విశ్వనాథ్ చెప్పారు. ఇక్కడున్న వాళ్లు తనకు సుపరిచితులని అన్నారు. ఈ నియోజకవర్గంలో తమిళ సంస్కృతి కూడా ఉందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు. తన మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని చూసి సహించలేకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.