అండమాన్‌లో 2 వార్డులు గెలిచామన్న టీడీపీ.. వ్యంగ్యంగా స్పందించిన విజయసాయిరెడ్డి!
- అండమాన్ లోకల్ పోల్స్‌లో టీడీపీ పోటీ
- రెండు వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయం
- ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న పార్టీ
- టీడీపీని ఎద్దేవా చేస్తూ సాయిరెడ్డి ట్వీట్
ఏపీలో విపక్ష పార్టీ టీడీపీ అండమాన్‌లోనూ తన శాఖను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి పార్టీ నేతలు స్థానికంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాటిలో పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తూ ఉంటారు. తాజాగా అండమాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా...ఎప్పటి మాదిరే టీడీపీ కూడా పోటీ చేసి రెండు వార్డుల్లో విజయం కూడా సాధించింది.
ఇదే విషయాన్ని వెల్లడిస్తూ టీడీపీ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. "కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండు వార్డులను గెలుచుకుంది" అంటూ పేర్కొంది.
ఈ ట్వీట్‌ను చూసినంతనే వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీపై సెటైర్లు సంధించారు. "అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (2 వార్డులు) గెలిచినందుకు టీడీపీ విజయోత్సవం జరుపుకుంటోంది. ఆంధ్రాలో ఇక 'పార్టీలేదు-బొక్కాలేద'ని నిర్ధారించుకున్న అచ్చెన్న కూడా త్వరలో అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు" అంటూ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.