జగన్ కు సినీ పెద్దలు సన్మానం చేయాలనుకోవడం విడ్డూరంగా ఉంది: నాదెండ్ల మనోహర్
- తక్కువ టికెట్ ధరలతో పేదలకు వినోదాన్ని అందుబాటులోకి తెస్తామని జగన్ అన్నారు
- రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా?
- ప్రభుత్వ తీరును సినీ పరిశ్రమ తప్పుపట్టాలన్న మనోహర్
రోజుకు ఐదు షోలకు అనుమతిని ఇవ్వడంతో పాటు, టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిని ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతేకాదు జగన్ కు సన్మానం చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ పెద్దల వైఖరిని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తప్పుపట్టారు.
పేదలకు తక్కువ టికెట్ ధరలతో వినోదాన్ని అందుబాటులోకి తెస్తామన్న జగన్... ఇప్పుడు రేట్లు పెంచారని విమర్శించారు. రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా? అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరును సినీ పరిశ్రమ తప్పుపట్టాలని అన్నారు. తమ విషయంలోనే వైసీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే విషయాన్ని సినీ పెద్దలు ఆలోచించాలని చెప్పారు. జగన్ కు సన్మానం చేయడానికి సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.