మన్కడింగ్ పై నిషేధం.. క్రికెట్ లో కొత్త రూల్స్ ఇవే!
- ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి
- బంతికి లాలాజలం రుద్దడం అక్రమం
- క్యాచ్ అవుటైతే.. కొత్త బ్యాటర్ నాన్ స్ట్రైకర్ ఎండ్ లోకే
- బ్యాటర్ ఉన్న చోటు నుంచే బంతి వైడా? కాదా? అన్నది నిర్ణయం
- కొత్త నిబంధనలను తీసుకొచ్చిన ఎంసీసీ
మాల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. విప్లవాత్మక మార్పులను చేసింది. బంతికి ఉమ్మి రాయడం, మన్కడింగ్ (ఒక బౌలర్ బంతి వేయకుండానే నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో వున్న బ్యాటర్ క్రీజు దాటినప్పుడు బౌలర్ అతనిని రన్ ఔట్ చేయడం) చేయడం వంటి వాటిని నిషేధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆలోపు అంతర్జాతీయ అంపైర్లు, అధికారులకు శిక్షణనివ్వనున్నారు.
బౌలింగ్ చేసేటప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని బ్యాటర్ రనౌట్ ను ఇప్పటిదాకా అన్ ఫెయిర్ ప్లే కింద లా 41 కింద పరిగణించేవారు. ఇప్పుడు దానిని నిషేధిస్తూ లా 38 (రనౌట్) పరిధిలోకి తీసుకొచ్చారు.
‘‘2017లో కోడ్ ఆఫ్ లాస్ ఆఫ్ క్రికెట్ లో మార్పులు జరిగినప్పటి నుంచి ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కోడ్ కు సంబంధించిన సెకండ్ ఎడిషన్ నిబంధనలు 2019లో అమల్లోకి వచ్చాయి. అయితే, అవన్నీ క్లారిఫికేషన్లే. చిన్నచిన్న సవరణలు జరిగాయి. కానీ, ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త నిబంధనలు మాత్రం చాలా పెద్ద మార్పులు. అక్టోబర్ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి’’ అని ఎంసీసీ లాస్ మేనేజర్ ఫ్రేజర్ స్టువర్ట్ చెప్పారు.
ఇవీ కొత్త నిబంధనలు

- బంతికి లాలాజలం రుద్దడం ఇకపై నేరం. దాని వల్ల బంతి తీరు మారే అవకాశం ఉంటుంది.
- కొత్తగా లా 1.3 నిబంధన. మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడి భర్తీ. అతడికి బదులు వేరే ఆటగాడిని తీసుకునేందుకు వీలు.
- లా 18.11లో మార్పులు చేశారు. ఓ బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. కొత్త బ్యాటర్ కచ్చితంగా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపే ఎక్కాలి. ఇకనుంచి క్యాచ్ అవుటయ్యే సందర్భంలో బ్యాటర్ సగం పిచ్ దాటినా కొత్త బ్యాటర్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపే రావాల్సి ఉంటుంది.
- ఓ వ్యక్తి లేదా జంతువు ఇతర వస్తువుల వల్ల ఆటకు అడ్డంకి ఏర్పడితే ఆ బంతిని డెడ్ బాల్ గా పరిగణిస్తారు.
- బంతి వేయడానికి ముందే స్ట్రైకర్ ను సదరు బౌలర్ రనౌట్ చేస్తే ఆ బంతిని డెడ్ బాల్ గా పరిగణిస్తారు. అయితే, అది అత్యంత అరుదైన సందర్భం.
- ఇటీవలి కాలంలో బ్యాటర్లు క్రీజులో విన్యాసాలు చేస్తున్నారు. క్రీజు మొత్తం అటూఇటూ కదులుతూ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు బంతి ఆ వ్యక్తి దేహానికి దూరంగా వెళ్లినా వైడ్ గా ఇవ్వడం లేదు. నిర్దేశించిన క్రీజు హద్దులను దాటితేనే వైడ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. బ్యాటర్ ఉన్న చోటు నుంచే బంతి వైడా? కాదా? అన్నది తేల్చనున్నారు.
- పిచ్ పై కాకుండా పిచ్ ఆవల మైదానంపై బంతి పడితే నో బాల్ గా పరిగణిస్తారు.
- మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ఫీల్డర్లు కదిలితే ఓ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించేవారు. తద్వారా బ్యాటర్ కొట్టిన షాట్ లేదా పరుగులూ లెక్కలోకి రాకపోతుండేవి. ఇకపై అలా కాదు. బంతిని డెడ్ బాల్ గా ప్రకటించడంతో పాటు బ్యాటింగ్ టీంకు 5 పరుగులను ఇవ్వనున్నారు.