సీఎంలు కేసీఆర్, జగన్‌కు దర్శకుడు రాజమౌళి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు
- ఇటీవల సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ఏపీ జీవో
- తెలంగాణలో పెద్ద సినిమాలకు ఐదో షోకు అనుమతి
- సినిమా పరిశ్రమ పునరుద్ధరణకు తోడ్పడుతాయన్న రాజమౌళి
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు పలు నిర్ణయాలు తీసుకుని ఇటీవలే వైసీపీ సర్కారు జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల ధరలను పెంచింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలకు దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
''సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ కొత్త జీవో విడుదల చేసి తెలుగు చలనచిత్ర రంగానికి సాయం చేసినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నాని గారికి థ్యాంక్స్. సినిమా పరిశ్రమ పునరుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆశిస్తున్నాను'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. కాగా, కరోనా వల్ల సినీ రంగం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ''థియేటర్లలో విడుదలయ్యే పెద్ద సినిమాలకుగాను ఐదవ ఆటకు అనుమతులు ఇచ్చినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. అలాగే, మాకు సాయపడుతోన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా థ్యాంక్స్. ఈ సాయం సినీ రంగానికి బాగా ఉపయోగపడుతుంది'' అని రాజమౌళి చెప్పారు. కాగా, రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.