అసోం మున్సిపల్ ఎన్నికల్లో ముందంజలో అధికార బీజేపీ

  • 80 మున్సిపల్ బోర్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు
  • 74 చోట్ల గెలుపు దిశగా బీజేపీ
  • కాంగ్రెస్ ఓకే స్థానానికి పరిమితం
  • ఏజీపీ, ఐఎండీ చెరో రెండు చోట్ల ముందంజ
అసోం మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బుధవారం నాడు ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 80 మున్సిపల్ బోర్డులకు గాను బీజేపీ 74 చోట్ల ముందంజలో ఉంది. ఈ నెల 6న ఎన్నికలకు పోలింగ్ నిర్వహించడం గమనార్హం.

బీజేపీ 74 మున్సిపల్ బోర్డుల్లో ఆధిక్యత ప్రదర్శిస్తుంటే.. కాంగ్రెస్ కేవలం ఒక మున్సిపాలిటీలోను, ఏజీపీ రెండు చోట్ల, ఐఎండీ రెండు మున్సిపల్ బోర్డుల్లోను ముందంజలో ఉన్నాయి. మొత్తం 977 వార్డుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. వీటిల్లో 57 స్థానాలకు పోటీ లేకపోవడంతో బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి ఎన్నిక లాంఛనమే. బీజేపీ 296 వార్డుల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది.


More Telugu News