మలయాళ స్టార్ కి థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్!
- ఈ నెల 11వ తేదీన 'రాధే శ్యామ్' రిలీజ్
- ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్
- మలయాళంలో ప్రభాస్ పాత్రకి పృథ్వీరాజ్ డబ్బింగ్
- 'సలార్'లోను ఆయనది కీలకపాత్ర
ప్రభాస్ తాజా చిత్రంగా రూపొందిన 'రాధే శ్యామ్' ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి థ్యాంక్స్ చెప్పాడు.
'రాధే శ్యామ్' సినిమా మలయాళ వెర్షన్ లో తన పాత్రకి పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా డబ్బింగ్ చెప్పారనీ, అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు. పృథ్వీరాజ్ గొప్ప నటుడు అని తాను చెప్పవలసిన పనిలేదనీ, 'సలార్' సినిమాలో ఆయన కీ రోల్ పోషించాడనీ, ఆయన నటనను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించిందని చెప్పాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. హీరోగా ఆయన ఎంత సక్సెస్ అయ్యాడో, దర్శకుడిగా కూడా అంతే సక్సెస్ కావడం విశేషం. ఇక నిర్మాతగాను ఆయన ఖాతాలో సక్సెస్ లు కనిపిస్తాయి. మరో విశేషమేమిటంటే, ఆయన మంచి సింగర్ కూడా. ఫాహద్ ఫాజిల్ తరువాత తెలుగు తెరకి పరిచయమవుతున్న మరో మలయాళ స్టార్ గా ఆయనను చెప్పుకోవచ్చు.