నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 91,142 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్రకటన.. నేడే నోటిఫికేషన్
- విద్యా శాఖలోనే దాదాపు 25,000-30,000 మధ్య ఉద్యోగాలు
- రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులు
- వారందరినీ క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన
- క్రమంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందన్న కేసీఆర్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 91,142 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యోగాలపై స్పందించారు. 91,142 ఉద్యోగాల్లో 80,039 పోస్టుల భర్తీకి నేడే నోటిఫికేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. నేడు ఆయా శాఖలు నోటిఫికేషన్లు జారీ చేస్తాయని వివరించారు. ఇందులో విద్యా శాఖలోనే దాదాపు 25,000-30,000 మధ్య ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారందరినీ క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగాలలో కాంట్రాక్ట్ అనే పదం ఉండకూడదని తాము భావించామని, దీని కోసం ఎంప్లాయ్ ఫ్రీ గవర్నమెంట్ విధానంతో ముందుకెళ్తున్నామని కేసీఆర్ చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటారని, అయినప్పటికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయని చెప్పారు.
అందుకే కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడదనేది తమ అభిలాష అని చెప్పారు. అందుకే వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లను ప్రకటించారు. నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. క్రమంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు.
ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంపు
ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు వయో పరిమితిగా నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు.
మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కులు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని అన్నారు. కేంద్ర సర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పుకొచ్చారు. తాము క్రమశిక్షణతో పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.
కొందరు తమ ఏక్రాగతను చెడగొట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత వివాదాలను ఏపీ ప్రభుత్వం తెగనివ్వట్లేదని అన్నారు. ఏపీ ఉద్యోగుల విషయంలో అర్ధరహితమైన వివాదం నడుస్తోందని తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టుకు వెళ్లిందని అన్నారు. ఉద్యోగ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని ఆయన అన్నారు.
కేసీఆర్ ప్రకటన ప్రకారం ఆయా పోస్టుల వివరాలు..
గ్రూప్1: 503
గ్రూపు 2: 582
గ్రూప్ 3: 1,373
గ్రూప్ 4: 9,168
జిల్లా స్థాయిలో : 39,829 ఉద్యోగాల భర్తీ
జోనల్ స్థాయిలో: 18,866
మల్టీజోన్ లో : 13,170
ఇతర కేటగిరీ: 8,174
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ పూర్తి వివరాలు..