దేశంలో మూడో వేవ్ కథ ముగిసింది.. ఫోర్త్ వేవ్ ఇక లేనట్టే: ప్రఖ్యాత వైరాలజిస్ట్

  • దేశం ఎండమిక్ దశకు చేరుకుంది
  • పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప నాలుగో వేవ్ భయం అక్కర్లేదు
  • గతంలో వచ్చిన ఇన్‌ఫ్ల్యూయెంజాలు కూడా రెండు మూడు దశల తర్వాత ముగిశాయన్న డాక్టర్ జాకోబ్ 
కరోనా వైరస్ భయాలు ఇక లేనట్టేనని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ డి.జాకోబ్ జాన్ పేర్కొన్నారు. దేశంలో కరోనా మూడోదశ ముగిసిందని, ఇక నాలుగో దశ భయాలు అక్కర్లేదని అన్నారు. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప నాలుగో వేవ్ ఆందోళన అక్కర్లేదని అన్నారు.  దేశం మరోమారు ఎండమిక్ దశకు చేరుకుందన్నారు. 

గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే వచ్చాయని, ప్రతి ఇన్‌ఫ్లూయెంజా రెండు, మూడు దశల తర్వాత ముగిసిందని డాక్టర్ జాన్ గుర్తు చేశారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్‌కు డాక్టర్ జాన్ గతంలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు.


More Telugu News