గ్యాస్ ఆధారిత డిజైర్ మోడల్ తీసుకువచ్చిన మారుతి సుజుకి ... ధర ఎంతంటే...!

  • రెండు వేరియంట్లలో డిజైర్ సీఎన్జీ
  • వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో కొత్త కారు
  • కిలో గ్యాస్ తో 31 కిమీ ప్రయాణం
  • రెండు వేరియంట్లలోనూ ఆప్షనల్ గా గ్యాస్ కిట్
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి గ్యాస్ ఆధారిత డిజైర్ సీఎన్జీ మోడల్ ను తీసుకువచ్చింది. వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ పేరిట ఈ సరికొత్త డిజైర్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఈ రెండు వేరియంట్లలో గ్యాస్ కిట్ ఆప్షనల్ గా ఎంచుకోవచ్చు. 

ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను పొందుపరిచారు. వీఎక్స్ఐ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.8,14,000 కాగా... జడ్ఎక్స్ఐ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.8,82,000గా పేర్కొన్నారు. ఈ డిజైర్ సీఎన్జీ కారు ఒక కిలో గ్యాస్ తో 31.12 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.


More Telugu News