ఇది రాష్ట్రానికే కాదు, దేశానికే తలవంపులు తెచ్చే దారుణం: చంద్రబాబు
- నెల్లూరు జిల్లాలో బ్రిటన్ మహిళపై అత్యాచార యత్నం
- మహిళా దినోత్సవం నాడు జరగడం మరీ సిగ్గుచేటన్న చంద్రబాబు
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలో మంగళవారం నాడు ఓ బ్రిటన్ మహిళపై జరిగిన అత్యాచార యత్నంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రానికే కాకుండా దేశానికే తలవంపులు తెచ్చే దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన రెండు వరుస ట్వీట్లు చేశారు.
సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలో ఓ బ్రిటన్ మహిళపై అత్యాచార యత్నం జరిగిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులో బ్రిటన్ మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్దారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.
ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 'నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై అత్యాచారయత్నం జరగడం రాష్ట్రానికే కాదు, దేశానికే తలవంపులు తెచ్చే దారుణం. అందునా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇలా జరగడం మరీ సిగ్గుచేటు. తెలుగుదేశం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.