ఆ 23 గెలిస్తే పోటీ చేయను!.. అచ్చెన్నకు రోజా ప్రతి సవాల్!
- రోజా మళ్లీ గెలిస్తే తామసలు పోటీనే చేయమన్న అచ్చెన్న
- తానెందుకు రాజీనామా చేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే
- 23 సీట్లలో రాజీనామా చేసి గెలవమంటూ రోజా సవాల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజిలో సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయన్న అచ్చెన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రోజా.. 160 కాదు కదా.. ఇప్పుడున్న 23 కూడా రావని పవర్ పంచ్ సంధించారు.
ఈ కామెంట్‌పై అచ్చెన్న కూడా చాలా వేగంగానే స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రోజా రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే.. 2024 ఎన్నికల్లో తాము అసలు పోటీనే చేయబోమని ఆయన రోజాకు సవాల్ విసిరారు.
ఈ సవాల్‌కు కూడా రోజా చాలా వేగంగానే ప్రతి సవాల్ విసిరారు. తాను రాజీనామా చేయడం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో వారు పోటీ చేయకపోవడమేమిటని ప్రశ్నించిన రోజా.. దమ్ముంటే టీడీపీ వాళ్లనే 23 సీట్లకు రాజీనామా చేసి మళ్లీ గెలవమనండి.. తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని రోజా ప్రతి సవాల్ విసిరారు. ఇలా మంగళవారం అచ్చెన్న, రోజాల మధ్య పవర్ ఫుల్ పంచ్ డైలాగులు, సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపించాయి. మరి తాజాగా రోజా విసిరిన ప్రతి సవాల్‌కు అచ్చెన్న ఏమంటారో చూడాలి.