పుతిన్ ఓ మృగం.. ఆ మృగం ఆక‌లి తీర‌దు: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

  • ఉక్రెయిన్ ఆక్ర‌మ‌ణ‌తోనే ఆగ‌రు
  • ఇత‌ర దేశాల‌పైనా ప‌డ‌టం ఖాయం
  • తినే కొద్ది ఆ మృగం ఇంకా కావాలంటుంది
  • పుతిన్‌పై జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఉక్రెయిన్‌పై దండెత్తి వ‌చ్చిన ర‌ష్యా భీక‌రంగా దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే యుద్దం మొద‌లై 13 రోజులు అయినా... ర‌ష్యా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా సోమవారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌పైకి త‌న అమ్ముల పొదిలోని 500 కేజీల బాంబుల‌ను ర‌ష్యా ప్ర‌యోగిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో అస‌లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల‌క్ష్యం ఏమిటో? అస‌లు పుతిన్ ఎలాంటి వారో? ర‌ష్యా అస‌లు టార్గెట్ ఏమిటో? అన్న విష‌యాల‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

పుతిన్‌ను ఓ మృగంగా అభివ‌ర్ణించిన జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించ‌డంతోనే పుతిన్ ఆక‌లి తీర‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా దండ‌యాత్ర ఉక్రెయిన్‌తో ఆగ‌ద‌ని, ఇత‌ర దేశాల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 'పుతిన్ ఓ మృగం లాంటివారు. ఆయ‌న ఎప్ప‌టికీ సంతృప్తి చెందరు. తినేకొద్దీ ఇంకా కావాలంటూ ఆ మృగం మిగిలిన దేశాలపై కూడా ప‌డుతుంది' అని జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News