ఏదోలా బయట పడండి.. ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచన
- మంగళవారం ఉదయం 10 గంటల నుంచే తరలింపు
- ఉక్రెయిన్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ సూచన
- మరో అవకాశం ఉంటుందో, లేదోనని ఆందోళన
- ఏదో మార్గం ద్వారా ఉక్రెయిన్ వీడాలని సూచన
రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కాసేపటి క్రితం ఓ కీలక అడ్వైజరీని జారీ చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సామాన్యుల తరలింపునకు మార్గం సుగమమైందని..తక్షణమే అందుబాటులో ఏ ప్రయాణ మార్గం ఉంటే దాని ద్వారానే ఉక్రెయిన్‌ను వీడాలని ఆ డ్వైజరీలో ఇండియన్ ఎంబసీ అక్కడి భారతీయులను కోరింది.
తాజా పరిస్థితులు, ఉక్రెయిన్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మరో అవకాశం ఉంటుందో, లేదోనని ఆందోళన వ్యక్తం చేసిన ఎంబసీ.. ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయులను కోరింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల నుంచే ఈ తరలింపు ప్రక్రియ మొదలు కానుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది.