సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడను ఎందుకు గాఢంగా అభిమానిస్తానంటే...!: పవన్ కల్యాణ్
- గోపాలగౌడ అణగారిన వర్గాల కోసం పోరాడారన్న పవన్
- రాజ్యాంగ హక్కుల కోసం మార్గదర్శనం చేశారని వెల్లడి
- ఆయన మాటలతో గొప్ప శక్తిని పొందగలిగానన్న పవన్
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ గురించి ప్రస్తావించారు. గోపాల గౌడను తాను గాఢంగా అభిమానిస్తానని, ఆయనంటే తనకు మిక్కిలి గౌరవం అని తెలిపారు.
అణచివేతకు గురైన వర్గాల పట్ల ఆయనకున్న నిబద్ధత, వారిపై చూపే శ్రద్ధ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పవన్ వెల్లడించారు. రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఆయన చూపిన సునిశిత మార్గదర్శనం దుష్టశక్తులతో నిరంతర పోరాటానికి తనకు స్ఫూర్తిని అందిస్తుందని వివరించారు. ఆయన మాటలతో తాను గొప్ప శక్తిని పొందగలిగానని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడతో తాను కలిసున్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.
కాగా, వకీల్ సాబ్ విడుదలైన సమయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ... ఆ సినిమాలో పవన్ కల్యాణ్ నటనను ప్రశంసించారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు ఇలాంటి సినిమా చేయడానికి సాహసించరని, కానీ పవన్ కు మాస్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వకీల్ సాబ్ సినిమా చేశారని కితాబునిచ్చారు. అంతేకాదు. ఆ సినిమాలో నటించారనడం కంటే జీవించారనడం సబబుగా ఉంటుదని పవన్ ప్రతిభను కొనియాడారు. దేవదాసు చిత్రం తర్వాత చరిత్రలో నిలిచిపోయే చిత్రం వకీల్ సాబ్ అని గోపాల గౌడ పేర్కొన్నారు.