దళిత బంధు యూనిట్లు వచ్చేశాయి.. కరీంనగర్‌లో పంపిణీ
- దళిత బంధు యూనిట్ల పంపిణీ షురూ
- జేసీబీలు, ఐషర్ వాహనాల పంపిణీ
- యూనిట్లు అందజేసిన మంత్రులు కమలాకర్, ఈశ్వర్
తెలంగాణలో టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పట్టాలెక్కేసింది. ఇప్పటిదాకా లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ చేసిన ప్రభుత్వం.. ఆ నిధులను డ్రా చేసుకునేందుకు లబ్ధిదారులకు అవకాశం ఇవ్వలేదని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ సర్కారు... పథకం అమలు దిశగా పక్కాగానే అడుగులు వేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీని మొదలుపెట్టింది.
ఈ మేరకు మంగళవారం నాడు కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్గి, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌లు యూనిట్లను అందజేశారు. ఈ యూనిట్లలో జేసీబీలు, ఐషర్ వాహనాలున్నాయి.