కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్నెల్లలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తాం: రేవంత్ రెడ్డి
- రిజర్వేషన్ బిల్లు కోసం సోనియా ఎంతో ప్రయత్నించారన్న రేవంత్
- అయితే మోదీ అడ్డుకున్నారని ఆరోపించిన టీపీసీసీ చీఫ్
- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్న రేవంత్
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్నెల్ల లోపు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నించారని, అయితే మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపైనా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యసనపరుల రాష్ట్రంగా మార్చారని, గల్లీల్లోనూ మద్యం, గంజాయి లభ్యమవుతోందని అన్నారు. మహిళల జీవితాలతో తెలంగాణ సర్కారు చెలగాటమాడుతోందని మండిపడ్డారు.