సెంటిమెంట్ టచ్.. ఉక్రెయిన్ కు భారీ సాయాన్ని అందించిన హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో 

  • 10 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన డికాప్రియో
  • ఉక్రెయిన్ లో జన్మించిన డికాప్రియో అమ్మమ్మ
  • 2008లో మరణించిన ఆయన అమ్మమ్మ
అందమైన ఉక్రెయిన్ దేశం రష్యా దాడులతో శ్మశానంగా మారిపోతోంది. ఎంతో సుందరమైన నగరాలు, భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్యులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ కు పలు దేశాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. వ్యక్తిగతంగా కూడా కొందరు ప్రముఖులు సాయం చేస్తున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో లియొనార్డో డికాప్రియో మానవతా ధృక్పథంతో భారీ సాయం అందించాడు. ఏకంగా 10 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చేశాడు. 

డికాప్రియో అమ్మమ్మ హెలెన్ ఇండెన్ బిర్కెన్ 1917లో ఉక్రెయిన్ లో జన్మించారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి జర్మనీకి వలస వెళ్లారు. జర్మనీలో డికాప్రియో అమ్మ జన్మించారు. తన అమ్మమ్మతో డికాప్రియోకు చాలా అనుబంధం ఉంది. ఆయన సినీ కెరీర్ ప్రారంభంలో అమ్మమ్మ ఎంతో ప్రోత్సహించారు. 2008లో 93 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. లియొనార్డో అన్ని సినిమాల ప్రీమియర్లకు తన మనవడు, కూతురుతో కలిసి ఆమె హాజరయ్యేవారు. తన అమ్మమ్మ మీదున్న ప్రేమతో ఆమె జన్మించిన దేశానికి డికాప్రియో భారీ సాయం చేశారు. అయితే తాను ఆర్థిక సాయం చేసినట్టు ఆయన ప్రకటించలేదు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ వైస్ గ్రాడ్ ఫండ్ సంస్థ వెల్లడించింది.


More Telugu News