మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చేతిలోనూ చావుదెబ్బ తిన్న పాక్ జట్టు
- వరుసగా రెండు ఓటములు
- అంతకుముందు భారత్ చేతిలోనూ పరాజయం
- అన్ని విభాగాల్లో రాణించిన ఆస్ట్రేలియా జట్టు
మహిళల ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు వరుస పరాభవాలను చవిచూస్తోంది. మంగళవారం న్యూజిలాండ్ లోని బే ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ మెరిసి అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆస్టేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ జట్టును ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులకు కట్టడి చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా కేవలం 34.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అలిస్సా హెలీ 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. దీంతో ఆడిన రెండు మ్యాచులలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది.
ఆరు ప్రపంచకప్ లను గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఈ విడత కూడా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్టే ఆడుతోంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు చాలా బలహీనంగా కనిపిస్తోంది. భారత్ చేతిలోనూ ఆరంభ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి పాలవడం తెలిసిందే. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బిస్మత్ మరూఫ్ 78 పరుగులు చేయగా, అలియా రియాజ్ 53 పరుగులు సాధించింది. కానీ మిగిలిన ఆటగాళ్లు చాలా తక్కువ స్కోరుకే వికెట్లను సమర్పించుకోవడం ఓటమికి దారితీసింది.