వ‌న‌ప‌ర్తిలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలను ప్రారంభించిన‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్

  • 'మన ఊరు-మన బడి' పైలాన్‌ ఆవిష్క‌రణ‌
  • తొలి ద‌శ‌లో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో ప‌నులు 
  • వనపర్తిలో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలో ప‌లు మండ‌లాల్లో ప‌లు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జడ్పీ ఉన్న‌త‌ పాఠశాలలో 'మన ఊరు-మన బడి' పైలాన్‌ ఆవిష్క‌రించారు. పాఠ‌శాల‌ల్లో 12 ర‌కాల మౌలిక స‌దుపాయాల కోసం ఈ ప‌థ‌కాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభిస్తోంది. 

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో భాగంగా తెలంగాణ‌లోని మొత్తం 26,065 పాఠశాలలను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తారు. తొలి ద‌శ‌లో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో ప‌నులు జ‌రుగుతాయి. కాగా, ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించే ముందు వనపర్తిలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. అలాగే, టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాసేప‌ట్లో ఆయన బహిరంగ సభలో పాల్గొననున్నారు.


More Telugu News