హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు
- హైదరాబాద్‌లోని లాలాగూడ పీఎస్‌లో నియామకం
- బాధ్యతలు స్వీకరించిన అధికారిణి మధులత
- మహిళా దినోత్సవం సందర్భంగా విధుల స్వీకరణ
హైదరాబాద్‌లోని లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్)గా మహిళా అధికారి మధులత నేడు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మహిళా సీఐ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొట్టమొదటి సారి.
ఈ రోజు ఉదయం హోంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కలిసి మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. ఆమెకు అభినందనలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. తెలంగాణ రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు ఏ మహిళా అధికారిణీ శాంతిభద్రతల విభాగ పోలీస్ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓగా లేరు.