రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయ విద్యార్థి
- ఖార్ఖివ్ లో ఇంజినీరింగ్ చదువుతున్న సాయినికేశ్
- సాయినికేశ్ తో కమ్యూనికేషన్ కోల్పోయిన కుటుంబ సభ్యులు
- ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్టు గుర్తించిన ఇండియన్ ఎంబసీ
యుద్ధ భూమి ఉక్రెయిన్ నుంచి ఎంతో మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. ఒక భారతీయ విద్యార్థి రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యం (సివిలియన్ ఆర్మీ)లో చేరాడు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సాయినికేశ్ రవిచంద్రన్ (21) ఉక్రెయిన్ లోని ఖార్ఖివ్ లో నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 2022 జులై నాటికి అతని కోర్సు పూర్తి కావాల్సి ఉంది. ఈలోగానే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు కావడంతో అతను అక్కడే చిక్కుకుపోయాడు.
ఈ క్రమంలో సాయినికేశ్ తో అతని కుటుంబసభ్యులు కమ్యూనికేషన్ కోల్పోయారు. దీంతో వారు ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ సాయం కోరారు. ఈ నేపథ్యంలో సాయినికేశ్ ని ఎంబసీ అధికారులు సంప్రదించారు. అయితే అతను రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్టు ఎంబసీ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. మరోవైపు 12వ తరగతి పూర్తయిన వెంటనే ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సాయినికేశ్ ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో అతను సక్సెస్ కాలేకపోయాడు.