వెంకట్రావు మృతికి కారణమైన వీరిపై కేసు నమోదు చేయాలి: చంద్రబాబు డిమాండ్
- సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారు
- వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులే కారణం
- వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనన్న బాబు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.
''శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, పొత్తంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారు.
వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసుల పైన కేసు నమోదు చెయ్యాలి. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను'' అని చంద్రబాబు నాయుడు ట్వీట్లు చేశారు.