'భీమ్లా నాయక్' హిందీ రిలీజ్ ను అలా ప్లాన్ చేశారట!

  • సంచలన విజయాన్ని సాధించిన 'భీమ్లా నాయక్'
  • 100 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమా 
  • హిందీలో రీలీజ్ చేయడానికి సన్నాహాలు
  • ఏప్రిల్లో అక్కడి థియేటర్స్ లో దింపే ప్రయత్నం  
పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా దర్శకుడు సాగర్ కె చంద్ర 'భీమ్లా నాయక్' సినిమాను తెరకెక్కించాడు. ఇది మలయాళ సినిమాకి రీమేక్ అయినప్పటికీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఒరిజినల్ సినిమాలో పాటలు ఉండవు .. కానీ ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు పాప్యులర్ అయ్యాయి. 

100 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమాను తెలుగుతో పాటే హిందీలో రిలీజ్ చేయాలని భావించారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చేసుకున్నారు. రీసెంట్ గా హిందీ ట్రైలర్ ను కూడా వదిలారు. ఇక రేపో మాపో ఈ సినిమా హిందీ రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ హిందీ వెర్షన్ ను ఈ నెలలో రిలీజ్ చేయడం లేదట. 

ప్రభాస్ 'రాధేశ్యామ్' పాన్ ఇండియా సినిమాగా ఈ నెల 11వ తేదీన విడుదలవుతోంది. ఎంతలేదన్నా ఒక రెండు వారాలపాటు ఏ థియేటర్లలో చూసినా ఈ సినిమానే ఉంటుంది. ఆ తరువాత 'ఆర్ ఆర్ ఆర్' రంగంలోకి దిగుతోంది. అందువలన ఏప్రిల్లో 'భీమ్లా నాయక్' హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.


More Telugu News