జగనన్న విద్యా దీవెన పథకం డబ్బు జమ వాయిదా

  • ఈరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు డబ్బులు
  • మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్
  • పథకం అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామన్న అధికారులు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ ఏడాదికి సంబంధించి నాలుగో విడత ఫీజు డబ్బులు పడాలి. అయితే, ఈ కార్యక్రమం వాయిదా పడింది.

ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా పడింది. పథకం అమలు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.


More Telugu News