జాన్ అబ్రహంతో కలసి చిందులేసిన శిల్పా శెట్టి

  • 2008 దోస్తానాను గుర్తుకు తెచ్చిన జంట
  • షటప్ అండ్ బౌన్స్ పాటకు స్టెప్పులు
  • తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన శిల్ప
  • తెలియని కలయికగా అభివర్ణన 
శిల్పాశెట్టి, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ కలయికగా వచ్చిన దోస్తానా సినిమా గుర్తుందా? 2008లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని మరోసారి శిల్పా, అబ్రహం అభిమానులకు గుర్తు చేశారు. ‘షటప్ అండ్ బౌన్స్’ పాటకు వీరిద్దరు మరోసారి చిందులేశారు. కలసి డ్యాన్స్ చేసిన వీడియోను నటి శిల్పాశెట్టి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తాజాగా పోస్ట్ చేశారు. అయితే ఎక్కడ కలిశారు, ఎక్కడ చిందులేశారన్న వివరాలను ఆమె ప్రస్తావించలేదు.

ఎంతో ఉత్సాహంతో ఇద్దరూ డ్యాన్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ‘‘మాకు తెలియని కలయిక ఇది’’ అంటూ శిల్పాశెట్టి పోస్ట్ పెట్టారు. (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి). మరోవైపు జాన్ అబ్రహం పలు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలసి అటాక్; షారూక్ ఖాన్, దీపిక పదుకొణెతో కలసి పఠాన్; అర్జున్ కపూర్ దిషా పఠానిలతో కలసి ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తున్నాడు. 


More Telugu News