దక్షిణాది చిత్రాలకు, బాలీవుడ్ సినిమాలకు తేడా చెప్పిన బోనీ కపూర్
- బోనీ కపూర్ నిర్మాతగా వాలిమై
- అజిత్ హీరోగా వచ్చిన చిత్రం
- ఫిబ్రవరి 24న విడుదల
- రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన వాలిమై
తమిళ హీరో అజిత్ తో నిర్మించిన వాలిమై చిత్రం సూపర్ హిట్టవడంతో నిర్మాత బోనీ కపూర్ లో ఆనందోత్సాహాలు పొంగిపొర్లుతున్నాయి. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాలిమై చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికీ భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో, నిర్మాత బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్రాలకు, బాలీవుడ్ సినిమాలకు తేడా ఏంటో చెప్పారు.
"ఇవాళ కొందరు ముంబయి ఫిలింమేకర్లు మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ, పిజ్జాలనే అందిస్తారు. మీరేం ఆర్డర్ చేస్తే అదే లభిస్తుంది అక్కడ. కానీ దక్షిణాదిలో అలాకాదు. అంతా విందు భోజనమే. భోజనంతోపాటు రోటీ, దాల్ చావల్, రకరకాల కూరలు, చికెన్.. ఇలా ఎన్నో అందిస్తారు. దక్షిణాది సినిమా అన్ని అంశాల మిశ్రమం అని చెప్పాలి. ప్రేక్షకులు కోరుకునేది ఇదే. ప్రతి అంశం కొంచెం అయినా ఉండాలనుకుంటారు. అన్ని అంశాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండాలని భావిస్తారు. దక్షిణాది ఫిలింమేకర్లు సృష్టించే సినిమాలు, వారి విధానాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయి కాబట్టే అక్కడి సినిమాలు చాలామందికి నచ్చుతాయి" అని వివరించారు.
అంతేకాదు, సౌత్, బాలీవుడ్ మధ్య మరో తేడాను కూడా బోనీ కపూర్ తెలిపారు. వాంటెడ్ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ఫైటింగ్ సీన్ లో సల్మాన్ ఖాన్ 16 మందిని బాదిపడేశాడని, అయితే అతడి ముఖంపై ఒక్క చెమట చుక్క గానీ, అతడికి చిన్న దెబ్బ కానీ లేకుండా సీన్ చిత్రీకరించారని పేర్కొన్నారు.
"హీరో అంతమందిని కొడుతున్నప్పుడు అతడు కూడా దెబ్బలు తినాలి కదా అని తాను దర్శకుడు ప్రభుదేవా, ఫైట్ మాస్టర్ విజయన్ లను అడిగితే, మన హీరోలు చెమట పట్టకుండా, దెబ్బలు తినకుండా కొట్టేస్తారని వాళ్లు చెప్పారు. వాళ్లు హీరోలు కాబట్టే ఆ విధంగా జరుగుతుంది అని తెలిపారు. దక్షిణాదిలో హీరోలను నమ్మి సినిమాలు తీస్తారు. అదే సమయంలో సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకుంటారు. దక్షిణాది ఫిలింమేకర్లు ఎంతో సంపన్నులు. కానీ బాలీవుడ్ లో చూస్తే ఏ ఇద్దరో ముగ్గురో విజయవంతమైన చిత్రాలు తీస్తుంటారు. దక్షిణాది నిర్మాతలతో పోల్చితే ఆ కొద్దిమంది నిర్మాతలు కూడా ఏమంత డబ్బు సంపాదించుకోనట్టే" అని వివరించారు.